దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కమల్ కోలుకుంటున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తనకు కోవిడ్ -19 సోకింది అంటూ గురించి ట్వీట్ చేసినప్పటి నుండి ఆయన అభిమానులు కమల్ త్వరగా కోలుకోవాలని పగలు, రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. రజినీకాంత్ తో సహా పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె శృతి హాసన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. శృతి హాసన్ తన తండ్రి పక్కన శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో ఉండటానికి చెన్నైకి వెళ్లింది. కమల్ హాసన్ క్వారంటైన్‌లో కొనసాగుతున్నప్పటికీ, శృతి ఆసుపత్రిలో తన తండ్రి పక్కనే ఉండాలని కోరుకుంటోంది. తన వర్క్ కమిట్ మెంట్స్ ముగిసిన వెంటనే విమానంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పుడు ఆమె చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఇప్పుడు కోలుకుని నిలకడగా కొనసాగుతుండగా, రాబోయే కొద్ది రోజులు శృతి అక్కడే ఉండాలనే ఆలోచనలో ఉంది.
Read Also : జయసుధ షాకింగ్ మేకోవర్… పిక్ వైరల్
ప్రస్తుతం శృతి హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రభాస్ సరసన ‘సలార్’తో పాటు ఆమె నటిస్తున్న అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది.
మరోవైపు కమల్ హాసన్ తన రాబోయే తమిళ యాక్షన్ చిత్రం ‘విక్రమ్’ షూటింగ్‌ను ముగించారు. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా నటించారు.
