Shruti Haasan as Teacher in Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ 1, 2 పాత్రలతో పాన్ ఇండియా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టగా మరిన్ని రికార్డులు రిలీజ్ అయ్యే లోపు బద్దలు కొడుతుందని ప్రభాస్ అభిమానులు అందరూ అంచనాలు వేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ పాత్ర ఏమిటి అనే విషయం రివీల్ అయింది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక టీచర్ పాత్రలో నటిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూ ద్వారా లీక్ అయింది.
Pizza 3 OTT: థియేటర్లలో విడుదలైన వారంలోనే ఓటీటీకి వచ్చేసిన ‘పిజ్జా 3’.. ఎక్కడ చూడాలంటే?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒక ఇంటర్వ్యూ చేయగా వారు తాము సలార్ సినిమాలో నటించామని చెబుతూ అందులో తాము శృతిహాసన్ దగ్గర చదువు చెప్పించుకునే పిల్లలుగా కనిపిస్తామని లీక్ చేసేశారు. శృతిహాసన్ పాత్ర పేరు ఆధ్యా అనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించారు కానీ ఆమె పాత్ర ఏమిటి అనే విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా ఇంటర్వ్యూ ద్వారా ఆ విషయం లీక్ అయింది అన్నమాట. ఇక ఈ సలార్ సినిమాని భారీ బడ్జెట్ తో హోం బలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలతో ఇప్పటికే షాకింగ్ ఈ సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆ దెబ్బతో సినిమా కూడా అనేక రికార్డులు బద్దలు కొట్టేసింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది వేచి చూడాల్సి ఉంది.