Site icon NTV Telugu

Shruti Haasan: బాయ్ ఫ్రెండుకు బ్రేకప్ చెప్పేసిన శృతి?

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan broke up with her Boy Friend: కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు వస్తున్నా సరే ముంబై మకాం మార్చేసింది. నిజానికి గతంలో సుమారు నాలుగేళ్ల పాటు ఒక విదేశీయుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ అనుకోకుండా బ్రేకప్ చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. కరోనా సమయంలో శంతను అనే మరో వ్యక్తితో ప్రేమలో పడినా ఆమె అనునిత్యం అతనితో కలిసి ఉన్న పోస్టులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వచ్చేది.

Jr NTR: వారిపై జూ.ఎన్టీఆర్ అసహనం.. ఇంత కోపంగా చూసి ఉండరు!

అయితే ఈ మధ్య పరిశీలిస్తే ఆమె సోషల్ మీడియా పోస్టులలో అతని ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. నిజానికి వీరు సుమారు నాలుగేళ్ల పాటు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరు కలిసి ఉండడం లేదని తెలుస్తోంది. వీరి బంధానికి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. ఒకరి సోషల్ మీడియా అకౌంట్స్ ని మరొకరు అన్ ఫాలో చేయడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున మీడియాలో జరుగుతోంది. ఒకరకంగా రిలేషన్ కి బ్రేకులు పడినట్లే అని కూడా ప్రచారం సాగుతోంది. నిజానికి అధికారికంగా ఆమె ఇద్దరితోనే డేట్ చేసినా కొంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు గతంలో ప్రచారం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు శంతనుకి కూడా బ్రేకప్ చెప్పడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక సినిమాల విషయానికొస్తే క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన ఈ భామ వరుస ప్రాజెక్టులైతే లైన్లో పెట్టింది.

Exit mobile version