Site icon NTV Telugu

మరో వెబ్ సిరీస్ లో శ్రుతి హాసన్!?

Shruthi Haasan Signs for Another Web Series?

తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ తనయ శ్రుతి హాసన్. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది శ్రుతి. ఆ తర్వాత వచ్చిన పవన్ ‘వకీల్ సాబ్’తో మరో హిట్ పట్టేసింది. దానికి ముందు ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఆంథాలజీ ‘పిట్ట కథలు’లో నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిపోడ్ లో నటించింది శ్రుతి హాసన్. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రుతి మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం వెబ్ సీరీస్ సైన్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్

ప్రైమ్ వీడియో కోసం శ్రుతి చేస్తున్న ఈ వెబ్ సీరీస్ హిందీలో రూపొందనుంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించాల్సి ఉంది. దీనికంటే ముందు తమిళంలో శ్రుతి నటించిన ‘లాభం’ విడుదల కావలసి ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’లోనూ శ్రుతినే నాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ సందర్భంగా ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన శ్రుతి తన సోషల్ మీడియాలో ఎంతగానో ప్రశంసించింది.

Exit mobile version