Bigg boss 6: ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో యంగ్ అండ్ ఛార్మింగ్ శ్రీహాన్ ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో డీసెంట్ బిహేవియర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్ లో పాల్గొన్న సిరి హన్మంతు ప్రియుడిగా గుర్తింపు ఉన్న శ్రీహాన్ మంచి నటుడు కూడా. అతను నటించిన ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ ‘ఆవారా జిందగి’. శ్రీహాన్ ప్రధాన పాత్రధారిగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కీలకమైన నలుగురు కుర్రాళ్ళలో శ్రీహాన్ కూడా ఒకడు. ‘జీరో లాజిక్ 100% ఫన్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కథను తయారు చేసుకుని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Read Also: V. V. Vinayak: తొలి తెలుగు పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’!
విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘ఆవారా జిందగీ’ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాత. ఆయన మూవీ గురించి మాట్లాడుతూ, ”ఇవాళ తెలుగులో వినోదాత్మక చిత్రాలకు చక్కని విజయం లభిస్తోంది. ఆ నమ్మకంతోనే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే చిత్రంగా ‘ఆవారా జిందగి’ని నిర్మించారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాను హై క్వాలిటీ తీశాం. ప్రతీక్ నాగ్ దీనికి చక్కని సంగీతం సమకూర్చారు” అని చెప్పారు. ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోసించిన ఈ సినిమాకు కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాత.
