తెలుగులో ఎన్నో మంచి సినిమాలని నిర్మించిన ‘స్రవంతి’ రవికిశోర్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కిన మొదటి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రం ఖాతాలో ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ అవార్డులు చేరాయి. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం మరియు ‘ఉత్గాతమ నటుడు’ కేటగిరిల్లో అవార్డులు అందుకుంది. ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్ కు అవార్డుతో పాటు రివార్డుగా ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలను అందజేశారు. ఈ చిత్రంలో నటించిన పూ రాము ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి ప్రధాన తారాగణం. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.
ఇరవై ఏళ్లుగా చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులు, దర్శక – నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందిస్తున్నారు. పలు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ‘కిడ’లో కథ, కథనం, నటీనటుల ప్రతిభ, నిర్మాణ విలువలు మెచ్చిన ఫెస్టివల్ జ్యూరీ ‘ఉత్తమ చిత్రం’ అవార్డు అందించారు. అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”గోవాలో ఈ ఏడాది జరిగిన ఇఫీలోని పనోరమాలో ‘కిడ’ను ప్రదర్శించారు. అప్పుడు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతకు మించిన ఆదరణ లభించింది. ఉత్తమ చిత్రంగా ‘కిడ’ నిలిచింది. నాకు, మా చిత్ర బృందానికి ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.
Our Tamil Debut Movie #Kida Has Won 2 awards –
Best Movie – Producer and Director & Best Actor at #ChennaiInternationalFilmFestival @ChennaiIFF 2022. Congratulations to the Entire Team. #SravanthiRaviKishore #RAVenkat #KidaForCIFF pic.twitter.com/160EMfgnDw— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 24, 2022
