Site icon NTV Telugu

Shraddha Srinath: 18 ఏళ్ల వయస్సులోనే అతడి కోసం.. ఆ టాటూ వేయించుకున్నా

Sradda

Sradda

Shraddha Srinath: హీరోయిన్లు.. టాటూలు పర్ఫెక్ట్ కాంబినేషన్. ముఖ్యంగా తమ ప్రియమైన వారి పేర్లు పచ్చబొట్లు పొడిపించుకోవడం చూస్తూనే ఉంటాం. అంటే వాటివలనే చాలామంది ఇబ్బంది కూడా పడ్డారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ముద్దుగుమ్మ తన పచ్చబొట్టు స్టోరీని చెప్పుకొచ్చింది. జెర్సీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్. ఈ సినిమా అమ్మడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తూ కనిపించే ఈ బ్యూటీ ప్రస్తుతం వెంకీ 75 గా తెరకెక్కిన సైంధవ్ లో నటిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు.

ఇక ఒక ఇంటర్వ్యూలో శ్రద్దా.. తన గుండెలపై ఉన్న టాటూ సీక్రెట్ ను బయటపెట్టింది. 18 ఏళ్ల వయస్సులోనే తాను ప్రేమలో పడ్డానని, దానికి గుర్తుగానే ఆ టాటూను వేయించుకున్నట్లు ఆమె తెలిపింది. ‘బీటిల్స్ అనే బ్రాండ్ ఒకటి ఉంది. నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్ ఆల్బమ్ కవరే. లవ్ అని దీనికి అర్థం. నాకు 18 ఏళ్ల వయస్సులో ఓ అబ్బాయి అంటే చాలా క్రష్ ఉండేది. అతడే నాకు బీటిల్స్ బ్యాండ్ ను పరిచయం చేశాడు. అలా ఆ రెండు ఇష్టాలు కలిసి ఈ టాటూ వేయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version