బాలీవుడ్‌లో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఎప్పుడూ గ్లామర్, రొమాంటిక్ లేదా యూత్‌ఫుల్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల విడుదలైన ‘స్త్రీ 2’తో మరోసారి తన క్రేజ్‌ను రుజువు చేసుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు శ్రద్ధా తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అభిమానులు, సినీ వర్గాలు ఆమె ఎలాంటి సినిమా ఎంచుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..
Also Read : Kangana Ranaut : ఫైనలీ.. పెళ్లి రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్
ఇటీవల బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మహారాష్ట్ర జానపద రంగంలో విశేష కీర్తి పొందిన విఠాబాయి భావు మంగ్ నారాయణ్ గావ్‌కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ నటించబోతుంది. విఠాబాయి అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తెరపైకి తీసుకురావడం శ్రద్ధా కెరీర్‌లో ఒక మైలురాయి కానుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమా యూనిట్ ఈ బయోపిక్‌కు ‘విట్టా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. టైటిల్ వినగానే అది మహారాష్ట్ర జానపద స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన పూర్వపు చిత్రాలు మనం చూశాం.. భావోద్వేగాలు, నేటివిటీకి దగ్గరగా ఉండేలా తెరకెక్కిస్తారు. కాబట్టి విఠాబాయి బయోపిక్ కూడా అదే రీతిలో బలమైన భావోద్వేగాలను మిళితం చేస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.
