Site icon NTV Telugu

Shraddha Das: అతడితో ప్రేమాయణం.. పెళ్లి పీటలు ఎక్కుతున్న ప్రభాస్ బ్యూటీ.. ?

Sraddha

Sraddha

Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా దాస్. ఈ సినిమా అమ్మడికి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయినా.. మంచి అవకాశాలను అయితే అందించింది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన ఈ చిన్నది.. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాతో శ్రద్దాకు మంచి పేరు వచ్చింది. అందులో ప్రభాస్ ను పిచ్చిగా ప్రేమించే పాత్రలో ఆమె నటించింది. ఇక అందాల ఆరబోతలో అమ్మడిని మించినవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో పాతుకుపోయిన శ్రద్దా పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ చిన్నది.. ఒక బిజినెస్ మ్యాన్ ప్రేమలో పడిందని, అతను కూడా శ్రద్దాను డీప్ గా ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ఇరు వర్గాలు ఒప్పుకోవడంతో.. త్వరలోనే ఈ హాట్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కనుందని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఈ ముద్దుగుమ్మనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం శ్రద్దా కెరీర్ విషయానికొస్తే.. రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అంతేకాకుండా కొత్తగా అమ్మడు సింగర్ గా అవతారమెత్తింది. త్వరలోనే లండన్‌లో జరగనున్న మ్యూజిక్ కన్సార్ట్‌లో సింగర్‌గా సినీ ప్రియులను అలరించనుంది. దానికోసం కఠోర శ్రమ చేస్తుందని తెలుస్తోంది. మరి ఈ హాట్ బ్యూటీ పెళ్ళిచేసుకుంటే.. తరువాత నటిస్తుందా.. ? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Exit mobile version