Site icon NTV Telugu

వరుడు కావలెను: అల.. ముగించేశారు

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, హైదరాబాద్ బ్యూటీ రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్ లో డైరెక్టర్ తో హీరోహీరోయిన్లు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. కాగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ తర్వాత శరవేగంగా సాగింది. ప్రస్తుతం షూటింగ్ కు గుమ్మడికాయ పడడంతో రిలీజ్ డేట్ పై ఫోకస్ పెట్టనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించగా.. మంచి ఆదరణ లభిస్తుంది.

Exit mobile version