“అమితాబ్ బచ్చన్ తో నటించటం గొప్పగా ఉంది” అంటోంది రశ్మిక మందణ్ణా. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. అయితే, తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది లవ్లీ లేడీ. అంతే కాదు, రీసెంట్ గా ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల పాటూ షూటింగ్ చేయటం వల్ల యాక్టర్స్ ఒకర్ని ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు. మేమంతా అదే చేశాం. అందువల్లే చక్కటి పర్ఫామెన్సెస్ వచ్చాయి. డైరెక్టర్, మిగతా వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘గుడ్ బై’ సినిమా ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్” అంది రశ్మిక.
వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బై’ మాత్రమే కాక సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ సినిమా కూడా చేస్తోంది ‘భీష్మ’ బ్యూటీ. అలాగే, తెలుగులో ‘పుష్ప’ లాంటి భారీ థ్రిల్లర్, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా మిస్ మందణ్ణ ఖాతాలో ఉన్నాయి…
షూటింగ్ కంప్లీట్ : బిగ్ బీకి ‘గుడ్ బై’ చెప్పేసిన రశ్మిక!
