NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషనే.. ఎవరు అవుట్ అయ్యారంటే?

Shobha Shetty Amardeep

Shobha Shetty Amardeep

Shocking Elimination in Latest Week of Bigg Boss Telugu 7: ప్రతి వారం లానే ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు 7 లీక్స్ వచ్చేశాయి. ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా ఇన్నర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది. ఓటింగ్ పోల్స్ లో శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారని చెబుతున్నారు. కాబట్టి బిగ్ బాస్ తెలుగు 7 నుండి ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావడం ఖాయంగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంటాడని అనుకున్నారు కానీ అతని ప్రస్తుత ఓటింగ్ మార్జిన్‌లు శివాజీ – అమర్‌దీప్‌ల కంటే పెద్దవి కావు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా టైటిల్‌ను గెలుచుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.

Mansoor Ali khan: మెగాస్టార్ పై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా

నిజానికి ఈ సీజన్‌లో శోభాశెట్టిని ఎలిమినేషన్ నుంచి బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ చాలాసార్లు కాపాడింది. అయితే ఈసారి మాత్రం శోభాశెట్టి కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తుంది. శోభ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు చివరి వారంలోకి ప్రవేశించనున్నారు. చివరి వారానికి ముందు, వచ్చే వారం మధ్యలో ఎలిమినేషన్ జరుగుతుంది. ఎక్కువగా, ఆ ఎలిమినేషన్ బుధవారం జరుగుతుంది. ఆపై, అన్ని మునుపటి సీజన్‌ల మాదిరిగానే, చివరి ఎపిసోడ్ రోజున కేవలం 5 మంది పోటీదారులు మాత్రమే ఉంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభమై చివరి వారానికి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఓటింగ్ పోల్స్ డిసెంబర్ 15 వరకు జరుగుతాయి. బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విజేతను డిసెంబర్ 17న ప్రకటిస్తారు, అర్జున్ అంబటి మినహా మిగిలిన ఆరుగురు పోటీదారులు బిగ్ బాస్ తెలుగు 7 14వ వారంలో నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే.

Show comments