NTV Telugu Site icon

Prabhas: జూబ్లీహిల్స్ లో ప్రభాస్ కు రూ. 60 కోట్ల ఫామ్ హౌస్.. బుద్ది ఉందా..?

Prabhas

Prabhas

Prabhas: సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. వారు ఎలాంటి హౌస్ లో నివసిస్తున్నారు.. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఇలాంటివి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇక వారి ఇంట్రెస్ట్ ను బట్టి పలు వెబ్ సైట్లు అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను వార్తలుగా రాస్తూ ఉంటారు . ఇక్కడ వరకు పర్లేదు కానీ, కొన్ని వెబ్ సైట్లు వ్యూస్ కోసం గాసిప్స్ రాస్తూ ఉంటారు. గాసిప్ అయినా పర్లేదు. కానీ అది కొంచెం మితిమీరి చెత్త న్యూస్ లా ఉండకూడదు అంటున్నారు నిర్మాత శోభు యార్లగడ్డ. అంతగా ఆయనకు కోపం తెప్పించిన వార్త ఏది అంటే.. ఒక ఫేమస్ ఇంగ్లిష్ వెబ్ సైట్ ప్రభాస్ ఆస్తుల గురించి ఒక ఆర్టికల్ రాసుకొచ్చింది.

అందులో ఏమున్నదంటే.. ప్రభాస్ కు జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉందని, ఇప్పుడు దాని విలువ రూ. 60 కోట్లని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రభాస్ ఈ ఫామ్ హౌస్ ను కేవలం కోటి రూపాయలకే సొంతం చేసినట్లు రాసుకొచ్చింది. అయితే ఈ న్యూస్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ విరుచుకుపడ్డాడు. బుద్ది ఉందా.. ఇలాంటి చెత్త న్యూస్ ఎలా రాశారు అంటూ కడిగిపడేశాడు. ” ఏంటీ, నిజమా.. జూబ్లీహిల్స్ లో ప్రభాస్ కు 84 ఎకరాలలో ఫామ్ హౌస్ ఉందా..? అసలు జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు అంటే దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా..? చెత్త న్యూస్ ఒకటి రాసి దానికి ఫేమస్ సెలబ్రిటీ పేరు రాయడం మీకు అలవాటు అయిపోయింది. అయినా ఒకే లైన్ లో లావిష్, సింపుల్ అనే పదాలు రావడమేంటో ” అంటూ మండిపడ్డారు. ఇక నెటిజన్లు సైతం అసలు జూబ్లీహిల్స్ లో 84 ఎకరాల స్థలం ఎక్కడ ఉందిరా అయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Show comments