NTV Telugu Site icon

Shobha Shetty: ఛీఛీ.. శోభాకు ఇంతకన్నా అవమానం ఉండదేమో..

Shobha

Shobha

Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది. గేమ్స్ లో ఫౌల్ ఆడడం, గేమ్ గెలవకపోతే అరవడం.. మిగతా కంటెస్టెంట్స్ తో గొడవపడటం తప్ప ఆ హౌస్ లో శోభా చేసింది ఏం లేదు. ఆమెకన్నా మంచిగా ఆడినవారిని ముందే పంపించి.. శోభను ఇన్ని వారాలు ఉంచడంతో అభిమానులు.. బిగ్ బాస్ నే తప్పు పడుతుండడం విశేషం. ఫేవరిజం చేస్తున్నారు అన్నందుకు.. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లపై కక్ష కట్టి.. నామినేషన్స్ లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు శోభా.. మూడో వారంలోనే బయటికి రావాల్సి ఉండగా.. బిగ్ బాస్ కంటెంట్ కోసం ఆమెను హౌస్ లోనే ఉంచాడు అని చెప్పుకొస్తున్నారు. ఇక అలానే ఓపికపట్టి.. ఎప్పుడెప్పుడు శోభా బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసిన అభిమానులకు.. 14 వారంలో అది జరిగింది.

ఇక బయటికి వచ్చాకా.. శోభాకు జరగని అవమానాలు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది బిగ్ బాస్ అభిమానులు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలోనే వెనకనుంచి చాలామంది.. ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడు వచ్చావు అంటూ అరవడం మొదలుపెట్టారు. ఈ మాటతో శోభా ముఖం వాడిపోయింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో ఆమె పై ట్రోల్స్ మాములుగా రావడం లేదు. హమ్మయ్య బిగ్ బాస్ హౌస్ ప్రశాంతంగా ఉంటుంది అని కొందరు.. తిరుపతి వెంకన్న స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం వేయలేదు రా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇళ్లలో శోభా ఎలిమినేట్ అని చెప్పగానే పూజలు చేసి.. సంతోషంతో హారతి ఇస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. శోభా బయటకి వచ్చి కుటుంబాన్ని చూసిన సంతోషం ఏమో కానీ.. ఇంతకంటే మరో అవమానం ఆమెకు ఉండదు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ భామకు బిగ్ బాస్ తరువాత కెరీర్ పరంగా ఎలాంటి మంచి జరుగుతుందో చూడాలి.