Shobha Shetty : శోభాశెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర చేసి బాగా ఫేమస్ అయింది. ఆమె అసలు పేరు కంటే మోనిత అంటేనే ఎక్కువ మంది గుర్తు పట్టేస్తారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది. అటు బిగ్ బాస్ లో కూడా రాణించింది. ఫైనల్ వరకు వెళ్తుందని అందరూ అనుకున్నా.. మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చాక తన ప్రియుడు అయిన యశ్వంత్ రెడ్డిని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది.
Read Also : Kamal Haasan : ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది.. కమల్ కామెంట్స్ పై రానా..
ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. అతి త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతోంది. ఈ టైమ్ లో శోభాశెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. కారణం ఏంటనేది మాత్రం చెప్పలేదు. అయితే త్వరలోనే తన ప్రియుడని పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
వీరిద్దరూ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉండాలని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారంట శోభాశెట్టి. ఎప్పటి వరకు అనేది కూడా క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసే శోభాశెట్టి.. ఇప్పుడు ఈ బ్రేక్ ఇవ్వడం అందరికీ షాకింగ్ గా ఉంది.
Read Also : Ameerkhan : లోకేశ్ కనకరాజ్‌తో మూవీ.. క్లారిటి ఇచ్చిన అమీర్ ఖాన్
