Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా పుల్టా గేమ్స్ ఆడిస్తూ బిగ్ బాస్ మరింత వినోదాన్ని అందిస్తున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ తర్వాత ఆమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక హౌస్లో శోభ చేసే రచ్చ అంతా కాదు. మొదటి నుంచి కూడా ఆమె తనదైన ఆటిట్యూడ్ తో ముందుకు కొనసాగుతుంది. ఆమె చేసే పనులు, మాటలు, అరుపులు.. అన్ని కూడా చాలామందికి చిరాకు తెప్పించినా ఇంకా ఎందుకు బిగ్ బాస్ లో ఉంచుతున్నారో తెలియట్లేదని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇకపోతే శోభాకు హౌస్ లోకి అడుగు పెట్టకు ముందే నిశ్చితార్థం అయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కొన్నిసార్లు హౌస్ లో తేజతో క్లోజ్ గా ఉంటే.. తనకు కాబోయే వాడు ఈ షో చూసి ఏమనుకుంటున్నాడు అనుకుంటూ మాట్లాడి ఎమోషనల్ అయ్యింది.
Kanguva: అయ్యా.. అయ్యా.. ఊర మాస్ అవతారం అయ్యా.. అరాచకం అంతే
ఇకపోతే 11 వ వారంలో నాగార్జున శోభ లవర్ ను అభిమానులకి పరిచయం చేశాడు. అతను కూడా ఒక సీరియల్ నటుడే. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన ఆదిత్య అందరికీ గుర్తే ఉన్నాడు. అతడు అసలు పేరు యశ్వంత్. పలు సీరియల్ లో నటించి తెలుగు వారికి దగ్గరైన ఈ కుర్రాడే శోభాకు కాబోయేవాడు. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని తెలుస్తుంది. ఇక మూడేళ్లు తమ ప్రేమను ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేసిన శోభ ఎట్టకేలకి బిగ్ బాస్ ద్వారా నాగార్జున బయట పెట్టేశాడు. దీంతో మూడేళ్లు ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరి పెళ్లి జరగనుందని సమాచారం. మరి ఈ హౌస్ లో శోభ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.