Site icon NTV Telugu

Shobha Shetty: ప్రియుడితో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Shobha Shetty

Shobha Shetty

Shobha Shetty Engagement with her love intrest: కార్తీక దీపం సీరియల్ నటి శోభాశెట్టి అలియాస్ మోనిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు 7లో అలరించింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో, మాటతో ప్రేక్షకులను అలరించిన ఈ కన్నడ బ్యూటీ.. ఇటీవల తన ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. హోస్టు నాగార్జున.. స్టేజీమీదకు శోభాశెట్టి లవర్ ను తీసుకువచ్చి.. అందరికీ పరిచయం చేసి షాక్ ఇచ్చాడు. ఈ బ్యూటీకి లవర్ ఉన్నట్లు అప్పటి వరకు తెలియదు. ఇక ఆ లవర్ ఎవరో కాదు.. కార్తీక దీపం సీరియల్ లో హీరో తమ్ముడిగా నటించిన యశ్వంత్. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా.. టీవీ ప్రోగ్రామ్స్ లో యశ్వంత్ తో కలిసి సందడి చేస్తుంది. ఇక తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రియుడు యశ్వంత్ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ లో వీడియోను పోస్ట్ చేసింది. దీనిని చూసిన ప్రేక్షకులు, అభిమానులు షాక్ అవుతున్నారు.

Prashanth Varma: హనుమాన్ హిట్ అయితే.. అవతార్ కన్నా పెద్ద ఫిల్మ్ చేస్తా

కొత్త ఏడాది సందర్భంగా ఓ టీవీ షోలో శోభాకు, యశ్వంత్ కు ఎంగేజ్మెంట్ చేశారు షో మేకర్స్. ఇక ఇద్దరు పూల దండలు మార్చుకుని.. రింగ్స్ కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేస్తూ… అందులో యశ్వంత్ నాకోసం సర్‌ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షోకు వస్తాడని అసలు ఊహించలేదని చెప్పుకువచ్చింది. షో వేదికపైనే మాకు ఎంగేజ్‌ మెంట్ కూడా చేయించారని సంతోషం వ్యక్తం చేసింది. యశ్వంత్, నేను కలిసి ఒక టీవీ షోలో కనిపించడం ఇదే మొదటిసారి.. ఇలా జరగడం సంతోషంగా ఉందంటూ చెప్పుకువచ్చింది. ఈ వీడియోలో యశ్వంత్‌ మాట్లాడుతూ.. ఇలా ప్లాన్‌ చేస్తున్నామంటే వచ్చానని… కేవలం 10 నిమిషాలే మీరు సర్‌ ప్రైజ్‌ ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు వివరించారు. నేను కూడా నీకు ఎప్పుడూ సర్‌ ప్రైజ్‌ ఇవ్వలేదు కదా.. అందుకే ఇలా ట్రై చేశాను అని చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మరింది.

Exit mobile version