NTV Telugu Site icon

Shivathmika Rajashekar: రాజశేఖర్ కూతురా.. ? మజాకానా..? ఎంత అందంగా ఉందో

Shivatmika

Shivatmika

Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత గారాలపట్టి శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శివాత్మికకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటే.. అంతంత మాత్రంగానే అందుకుంది. ఇక తమిళ్ లో ఆకాశం, తెలుగులో ఈ మధ్యనే రంగమార్తాండ, మీట్ క్యూట్ సినిమాల్లో నటించి మెప్పించిన శివాత్మిక.. ప్రస్తుతం మరో కొత్త చిత్రంలో నటిస్తోంది. అయితే.. శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కించడంలో దొరసాని ముందు ఉంటుంది. ఇక శివాత్మిక.. ఎంత మోడ్రన్ గా కనిపిస్తోందో.. అంతే ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అమ్మడికి చీర మీద ఉన్నంత మక్కువ.. ఇంకా దేనిమీద ఉండదు అనేలా కనిపిస్తూ ఉంటుంది.

Anupama Parameswran : ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఎంతో బాధ పడ్డాను..

స్లీవ్ లెస్ బ్లౌజ్ పై సింపుల్ గా ఉండే చీరలు కట్టి.. అందమైన నడుమును, బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి చీరకట్టుతో శివాత్మిక మెస్మరైజ్ చేసింది. గ్రీన్ కలర్ చీరపై బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి.. కలువ రేకులంటి కళ్లకు కాటుక పెట్టి.. నిండుగా బొట్టుపెట్టి తీర్చిదిద్దినట్లు కనిపించింది. ప్రకృతి ఒడిలో పరువాలను ఆరబోస్తున్న వనితలా శివాత్మిక కనిపించింది. ముఖ్యంగా ఉయ్యాల ఊగుతూ బ్యాక్ ను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు రాజశేఖర్ కూతురా.. ? మజాకానా..? ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది మంచి మంచి అవకాశాలను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందో.. లేదో.. చూడాలి.