NTV Telugu Site icon

Shivanna: రూట్ మార్చి ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న శివన్న…

Shiva Raj Kumar

Shiva Raj Kumar

“సప్త సాగరాలు దాటి” సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎం రావు, 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా న‌టించింది. ఇక ఈ సినిమా అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు . కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Also: Vijay Deverakonda: రేషన్ షాప్ కి ఆధార్ ఎందుకు? ట్రోలింగ్ చేయడమే టార్గెట్

Read Also: Poonam Pandey : ‘పూనమ్ బతికే ఉంది.. పబ్లిసిటీ స్టంట్ చేసింది’.. ట్వీట్ చేసిన ఉమైర్ సంధు

గోధి బన్న సాధారణ మైకట్టు కవలుదారి, భీమ సేన నల మహారాజు, సప్త సాగరాలు దాటి లాంటి డిఫరెంట్ జాన‌ర్‌లు త‌ర్వాత హేమంత్ ఎం రావు యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. వైశాక్ ఏ గౌడ “తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని తెలియజేశారు”.

Read Also: Siddharth Anand: 90% మంది ఇండియన్స్ ఫ్లైట్ ఎక్కలేదు అందుకే నా సినిమా ఆడలేదు…