Site icon NTV Telugu

Rahul Vijay – Shivani: జంటగా నటించబోతున్న సినీ వారసులు!

Rahul Vijay Shivani Romance

Rahul Vijay Shivani Romance

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో హీరోగా నటించాడు. అలానే నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ ‘దొరసాని’ మూవీతో తెరంగేట్రమ్ చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటించబోతున్నారు. దీనిని ‘తెల్లవారితే గురువారం’ మూవీ దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కిస్తున్నాడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ -2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్రం రెగ్యులర్ జరుపుకోనుంది. ఈ సినిమా కోసం ఒక ఇంటి సెట్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేశారు. ‘మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ ఇదని, పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాషెస్ తో ఈ సినిమా ఉంటుంద’ని దర్శకుడు తెలిపాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version