Site icon NTV Telugu

‘Shivam Bhaje’: ఆసక్తికరంగా ‘శివం భజే’ ఫస్ట్ లుక్

Shivam Bhaje

Shivam Bhaje

‘Shivam Bhaje’ First Look: అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో ‘శివం భజే’ అనే సినిమా తెరకెక్కుతోంది. అప్సర్ దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ ‘శివం భజే’ అందరి దృష్టిని ఆకర్షించగా ఈ రోజు చిత్రం నుండి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో అశ్విన్ కనపడుతున్నారు. అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనక దేవుడి విగ్రహం చూస్తుంటే చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. కొత్త కథ, కథనాలతో అప్సర్ దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది.

Tribute To Sridevi: Tribute To Sridevi: ఇది కదా శ్రీదేవికి సిసలైన నివాళి

టైటిల్ కంటే ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి లాంటి నటులు మా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర ఈ చిత్రంలో అదిరిపోయే విజువల్స్ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యప్తంగా జూన్ లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని అన్నారు. అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, వికాస్ బడిస మ్యూజిక్ డైరెక్టర్, దాశరథి శివేంద్ర డీ ఓ పిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version