NTV Telugu Site icon

Shivaji: గురిచూసి కొట్టిన శివాజీ.. అమర్ పై పగ ఇలా తీర్చుకున్నాడు.. ?

Sivaji

Sivaji

Shivaji: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. బిగ్ బాస్ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఉల్టా ఫుల్టా అని సీజన్ మొదటనే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే సీజన్ మొత్తం ఊహించని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక షో మొదలైన మొదటివారం నుంచి ఇప్పటివరకు అమర్ కే, శివాజీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎప్పుడు శివాజీ.. పల్లవి ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు అని, ఇక శివాజీ.. మిగతావారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి.. గేమ్ ఆడిస్తున్నాడు అని ప్రతి నామినేషన్ లో అమర్.. శివాజీనే నామినేట్ చేస్తూ వచ్చాడు. అమర్ కు కోపం ఎక్కువ అని, గేమ్ అర్ధం కాదు అని, అతని బలం అతనికి తెలియదు అని శివాజీ చెప్పుకొస్తూ నామినేట్ చేస్తూ వచ్చాడు. ఇలా దాదాపు 8 వారాలు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే వచ్చింది. ఇక ఆ తరువాత నుంచి అమర్ లో కొంత మార్పు వచ్చింది. గేమ్ ఆడుతూ.. కెప్టెన్ అవ్వడానికి చాలా కష్టపడుతూ వస్తూనే ఉన్నాడు. దీంతో అమర్ కు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పాడు శివాజీ. చెప్పినట్లే గతవారం.. ప్రియాంక,అమర్, అర్జున్ ల మధ్య జరిగిన బాల్స్ గేమ్ లో అమర్ కు సపోర్ట్ చేశాడు.

ఇక ఆ గేమ్ లో బాగా ఏడ్చి.. సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. శివాజీ, గేమ్ ఓడిపోతే ఏడవడం తనకు నచ్చలేదని చెప్పగా .. అమర్ .. అదంతా నా స్ట్రాటజీ అని తీసిపడేశాడు. అంటే అమర్ ఏడ్చింది అంతా స్ట్రాటజీ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక చూస్తూ చూస్తూనే 12 వారం కూడా వచ్చేసింది. ఇప్పటివరకు ఉన్నవారిలో అమర్, రతిక, అశ్విని తప్ప.. మిగిలినవారందరూ కెప్టెన్ గా చేశారు. మొదటి వారం నుంచి అమర్ .. కెప్టెన్సీ కోసం కస్టపడుతున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఓడిపోతూనే ఉన్నాడు. ఇక చివరి కెప్టెన్సీ కోసం నిన్న హౌస్ లో పెద్ద యుద్ధమే జరిగింది. హౌస్ మేట్స్ అందరూ.. ఎవరు కెప్టెన్ కావాలని భావిస్తారో వారి పేరు చెప్పి తగిన రీజన్స్ చెప్పమని అడగగా.. అమర్ కు, అర్జున్ కు టై అయ్యింది. ఇక చివరగా శోభా, శివాజీ ఓటు కోసం గొడవపడ్డారు. ఈ సమయంలో శివాజీ.. అమర్ పై రివేంజ్ తీర్చుకున్నాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్. ఇక ఉండదు అని తెలిసి కూడా శివాజీ ఎలా అర్జున్ ను సపోర్ట్ చేసాడు.. ? మొదటినుంచి కూడా అమర్.. శివాజీ పై వేసిన నిందలు మొత్తం ఏకరువు పెట్టాడు. ఇక శివాజీ చెప్పిన మాటలను తీసుకోలేని అమర్ ఏడవడం మొదలుపెట్టాడు. ఇక ఈ ఏడుపు కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే అదంతా తన స్ట్రాటజీ అని శివాజీకి ముందే చెప్పాడు కాబట్టి. ఇక శివాజీ, అమర్ తన పాయింట్ ను చెప్పుకొచ్చాడు.

అమర్ ను కెప్టెన్ చేస్తే.. శోభ, ప్రియాంక ను డిప్యూటీస్ ను చేస్తాడు అని చెప్పినట్లు శివాజీ చెప్పాడు. వాళ్లు కాకుండా కొత్తవారిని తీసుకుంటాడేమో అని చెప్తాడేమో అని చూశానని చెప్పాడు. కానీ, ఆ ముగ్గురు మాత్రమే ఉండడం అనేది.. తనకు నచ్చడం లేదని.. మొదటి నుంచి కూడా వాళ్ళు బయట మాట్లాడుకొని వచ్చి .. ఇక్కడ బయాస్డ్ గా ఆడుతున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. ఇక్కడ శివాజీ రైట్ అని కొందరు.. రాంగ్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం శివాజీ డెసిషన్ మేకర్ గా మారాడు. అతని వలనే ఈ చివరి కెప్టెన్సీ రద్దు అయ్యింది అని .. అమర్ ను శివాజీ గురి చూసి కొట్టాడు అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఈ రెండు వారాల్లో ఎవరు విన్నర్.. ఎవరు రన్నర్ అనేది తెలిసిపోతుంది. దానికోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీజన్ కు విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.