Prince Trailer: ‘జాతిరత్నాలు’ ను మించిన కామెడీ.. హిట్ కొట్టేలా ఉన్నాడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prince Trailer: జాతిరత్నాలు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు కేవీ అనుదీప్. ఈ సినిమా తరువాత డైరెక్ట్ గా బై లింగువల్ సినిమానే తీయడానికి రెడీ అయిపోయాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన బ్రిటిష్ భామ మరియా రబోష్యాపక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాట్రైలెర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే జాతిరత్నాలు కామెడీ గుర్తుకు రాక మానదు. ” కులం మతం గురించి ఇంకా కొట్టుకొనేవాళ్ళు ఉన్నారా” అంటూ సత్యరాజ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. దేవరకోట అనే గ్రామంలో కులమతాల పట్టింపుతో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆ ఊరుకు సత్యరాజ్ కొడుకుతో కలిసి వస్తాడు.. సత్యరాజ్ కొడుకు స్కూల్ లో ఓ టీజర్ గా పనిచేస్తుంటాడు. అదే స్కూల్ కు టీచర్ గా వచ్చిన ఒక బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ఆమె కూడా హీరోను ప్రేమించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులం ను పట్టించుకొనే గ్రామస్థులు ఏకంగా మన దేశం కానీ పిల్లను ప్రేమిస్తావా అంటూ హీరో, హీరో కుటుంబంపై దండెత్తి వస్తారు. మరి చివరికి ఈ ఖండాంతర ప్రేమ గెలిచిందా..? గ్రామస్థులు వీరి పెళ్ళికి ఒప్పుకున్నారా..? లేదా అనేది కథగా తెలుస్తోంది. ఇక అనుదీప్ తన పంచ్ లతో ట్రైలర్ ను నింపేశాడు. ఇండియాకు సంబంధించిన ఒక్క విషయమన్నా ఫాలో అయ్యావా నువ్వు అని హీరోను అడుగగా భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సోదరసోదరీమణులు ఫాలో అయ్యా కాబట్టే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించా అని చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ వినోదాత్మకంగా కనిపిస్తోంది. శివ కార్తికేయన్ కామెడీ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. థమన్ నేపధ్య సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే అనుదీప్ మరో జాతిరత్నాలు ను అందించేలా కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ జాతిరత్నాల డైరెక్టర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!