Prashanth Neel: ప్రభాస్ తో చొక్కా విప్పించాడు… అభిమానులు చొక్కాలు చింపుకునేలా చేసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్… ఈ మధ్య కాలంలో ఇండియా చూసిన బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది మూడు సినిమాలే, ఈరోజు రిలీజ్ అయ్యింది నాలుగో సినిమా. సరిగ్గా పదేళ్ల కెరీర్ కూడా లేని ఈ దర్శకుడిని పాన్ ఇండియా ఆడియన్స్ నమ్మారు. KGF సినిమాతో నెవర్ బిఫోర్ కమర్షియల్ సినిమాని ఆడియన్స్ ని పరిచయం చేసిన ప్రశాంత్ నీల్, రాజమౌళి తర్వాత లార్జ్ స్కేల్ సినిమాలో డ్రామాని సూపర్బ్ గా చూపించే దర్శకుడు అయ్యాడు. హీరోలని డెమీ గాడ్స్ గా చూపించినా కూడా అండర్ కరెంట్ గా ఉండే ఎమోషన్ తో కథని నడిపిస్తాడు ప్రశాంత్ నీల్. అందుకే ఎంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, హీరో క్యారెక్టర్ కి ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసారు, హీరోకి జేజేలు కొడతారు. ఇలాంటి దర్శకుడికి ప్రభాస్ దొరికితే ఎలా ఉంటుంది… ఈ ఊహ నుంచి పుట్టిందే సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు? ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తాడు? ప్రభాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ మాత్రమే న్యాయం చేయగలడు.
ఈ మధ్య కాలంలో ప్రభాస్ పూర్తి స్థాయి మాస్ సినిమా చెయ్యలేదు, ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కలిసాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భూకంపం తెప్పిస్తుందా? ఇలా అనేక రకాల ఆలోచనలతో ప్రభాస్ ఫ్యాన్స్ రోజులు గడిపారు. వాటన్నింటికీ ఒక్క సీన్ తో సమాధానం చెప్పేసాడు ప్రశాంత్ నీల్. క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక ట్విస్ట్ ఇచ్చి… ప్రభాస్ తో షర్ట్ విప్పించాడు ప్రశాంత్ నీల్. తెరపై ప్రభాస్ షర్ట్ లెస్ గా కనపడడం ఆలస్యం థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ వాళ్ల చొక్కాలని చింపేసుకునే వరకూ వెళ్లారు. ఈ రేంజ్ ఎలివేషన్స్ ని కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సీన్ తో ఓవర్ లోడెడ్ గూస్ బంప్స్ ఇచ్చి థియేటర్ నుంచి ఆడియన్స్ ని బయటకి పంపించాడు ప్రశాంత్ నీల్.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!