సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు ఈ కేసుకు సంబంధించిన పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ శిల్పా శెట్టిని కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. వ్యక్తిగతంగాను శిల్పా కెరీర్ పై ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఇదిలావుంటే, తాజాగా శిల్పా ఓ ఈవెంట్ లో ఫిట్ నెస్ ఔత్సాహికురాలుగా కొన్ని ఫిట్ నెస్ సూత్రాలను తెలిపింది. శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలో ఆమె ప్రదర్శించింది. అంతా శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నామని ఆమె చెప్పింది. ఇది మన శ్వాస ప్రక్రియ ద్వారా మన మొత్తం వ్యవస్థను కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగడానికి.. సానుకూల ఆలోచనలను మెరుగుపరచడానికి శ్వాస మీద ధ్యాస మంచి ప్రాణాయామంగా నిలుస్తోందని శిల్పా శెట్టి స్వయంగా చేసి చూపించింది.
శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నాం..
