Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి వరుస వివాదాలతో కాంట్రవర్సీ అవుతోంది. అయినా సరే ఆమె సంపాదన మాత్రం అస్సలు తగ్గట్లేదు. మనకు తెలిసిందే కదా.. శిల్పాశెట్టి బాలీవుడ్ రిచ్ హీరోయిన్లలో ఒకరు అని. ఆమె భర్త రాజ్ కుంద్రా ఎన్నో వ్యాపారాల్లో ఉన్నారు. కానీ ఆ మధ్య అశ్లీల వీడియోల విషయంలో అరెస్ట్ అయి వివాదం అయ్యాడు. రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్లు మోసం చేశారనే కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా రచయిత్రి శోభా డే తెలిపారు. ఆమె దీనిపై ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Read Also : JR NTR Fans : సీపీ సజ్జనార్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఫిర్యాదు.. ఎందుకంటే..?
ముంబైలోనే ఖరీదైన రెస్టారెంట్లలో శిల్పాశెట్టికి చెందిన బాస్టియన్ రెస్టారెంట్ కూడా ఒకటి. నేను ఆ రెస్టారెంట్ గురించి రకరకాలుగా విన్నాను. కానీ అవి నమ్మలేదు. రీసెంట్ గా ఆ రెస్టారెంట్ లోపలకు వెళ్లి షాక్ అయ్యాను. చాలా లగ్జరీగా ఉంది. ఒకే సారి 1400 మంది భోజనం చేయొచ్చు. ఆ రెస్టారెంట్ కు రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. వీకెండ్ లో అయితే రూ.3 కోట్లదాకా వస్తోంది. అక్కడ చాలా పెద్ద హాళ్లు కట్టారు. అవి చూసి నాకు మతి పోయింది. శిల్పాశెట్టికి ఆ ఒక్క రెస్టారెంట్ తోనే ఆదాయం బోలెడంత వస్తోంది అంటూ చెప్పుకొచ్చింది శోభా డే.
Read Also : Nayanthara : చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ.. పిక్స్ వైరల్
