Site icon NTV Telugu

Fighter: “షేర్ కుల్ గయ” సాంగ్ తో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు

Fighter

Fighter

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా యువ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై మమతా ఆనంద్, రామన్ చిబ్, మరియు అంకు పాండే గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని స్కై యాక్షన్ ఎపిసోడ్స్ తో టీజర్ కట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తే ఫైటర్ ఏ స్టాండర్డ్స్ లో తెరకెక్కింది అనే విషయం అర్థమై పోతుంది.

Read Also: Animal Collections: 800 కోట్లు… రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డినే?

హ్యూజ్ స్కేల్ లో రూపొందుతున్న ఫైటర్ సినిమా వచ్చే 2024 జనవరి 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. రిపబ్లిక్ డే కనుకుగా బయటకి రానున్న ఫైటర్ మూవీ నుండి “షేర్ కుల్ గయ” సాంగ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్, హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో గతంలో “బ్యాంగ్ బ్యాంగ్” మరియు “వార్” సినిమాలు సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also: Youtuber Chandu Sai: ప్రముఖ యూట్యూబర్ ‘పీకే’ చందు సాయి అరెస్ట్!

Exit mobile version