Site icon NTV Telugu

Sekhar Kammula : అందుకే ధనుష్ అంటే టెన్షన్.. శేఖర్ కమ్ముల కామెంట్స్

Sekhar

Sekhar

Sekhar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచేసింది. ఇందులో ధనుష్ నటించడంపై శేఖర్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మూవీ జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా శేఖర్ కమ్ముల, నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ధనుష్ ను ఈ సినిమాలోకి తీసుకున్నప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయన యాక్టర్ మాత్రమే కాదు. మంచి డైరెక్టర్ కూడా. లిరిక్స్ రాస్తారు.

Read Also : Nagarjuna : విలన్ పాత్రల్లో నాగార్జున.. రాంగ్ రూట్ ఎంచుకున్నాడా..?

ఒకవేళ రెండో టేక్ తీసుకుందామంటే ఏమనుకుంటాడో అనుకునే వాడిని. కానీ ధనుష్ నా అంచనాలను తప్పు చేశాడు. ఒక్క టేక్ లోనే కంప్లీట్ చేసేవాడు. అదే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. నాగార్జునతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి ఇందులో ఇద్దరం కలిసి హాయిగా చేసేశాం.

ఎలాంటి ఇబ్బంది పడలేదు. కాకపోతే ఆయన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకున్నా. మూవీ ఔట్ పుట్ బాగా వచ్చింది. ఇది సరికొత్తగా ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటిది మీరు చూసి ఉండదు. ముంబై ప్రాంతంతో ఇది ముడిపడి ఉంటుంది. కానీ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా తీశా అంటూ తెలిపారు శేఖర్.

Read Also : Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..?

Exit mobile version