Shekhar Kammula : శేఖర్ కమ్ముల వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. రీసెంట్ గానే కుబేర మూవీతో మంచి హిట్ అందుకోవడంతో పాటు అగ్ర హీరోలు, దర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఓ సారి ఆయన్ను పెద్ద డైరెక్టర్ రిజెక్ట్ చేశాడంట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్. నేను అమెరికాలో డైరెక్టర్ కోర్స్ చేశాను. ఆ టైమ్ లో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నాను. నిన్నే పెళ్లాడతా మూవీ చూసిన తర్వాత దాని డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుసుకున్నాను. ఆయన సినిమాలు చూశాను. ఎలాగైనా ఆయన వద్ద పనిచేయాలని అనుకున్నా. ఇండియా వచ్చిన తర్వాత వెళ్లి ఆయన్ను కలిశాను. అప్పుడు సింధూరం మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అంటూ తెలిపాడు శేఖర్.
Read Also : Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?
మీ వద్ద పనిచేయాలని ఉందని వెళ్లి చెప్పా. కానీ ఆయన నన్ను సున్నితంగా వద్దని చెప్పాడు. సినిమా మధ్యలో కొత్త వారిని తీసుకోవడం ఎంత కష్టమో నాకు తర్వాత తెలిసింది. కానీ ఆయన నాకు మంచి మిత్రుడు. ఇప్పటికీ కలుస్తూ ఉంటా. నా సినిమాలను ముందుగా ఆయనకు చూపిస్తుంటాను. ఆయన వర్కింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. తాను చిరంజీవి వల్లే సినిమాల్లోకి వచ్చానని వివరించారు. నేను మొదట్లో పెద్దగా సినిమాలు చూసేవాడిని కాదు. పుస్తకాలు కూడా చదవలేదు. కానీ పదివేల మందిలో చిరంజీవి నన్ను పిలిచి ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత సినిమాల్లోకి రావాలని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.
