Site icon NTV Telugu

Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్

Shefali Jariwala

Shefali Jariwala

‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షెఫాలీ జరివాలా, అప్పటి నుంచి “కాంటా లగా గర్ల్”గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా, పలు రియాలిటీ షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ముఝ్సే షాదీ కరోగి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టకరంగా తాజాగా 2025 జూన్ 27న కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఈ విషయం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

Also Read : Peddi : రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల!

ఇటీవల ఆమె భర్త పరాగ్ త్యాగి, “షెఫాలీ పరాగ్ త్యాగి” పేరుతో ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్‌లోనే తన భార్య గురించి మాట్లాడి, ఆమె లేకుండా జీవితం తనకు ఎంత కష్టమైందో పంచుకున్నారు. పరాగ్ మాట్లాడుతూ – “షెఫాలీ లేకుండా బతకడం కష్టం గా ఉంది. ఆమె వాడిన బ్రష్‌తోనే పళ్లు తోముకుంటున్నాను. ఆమె వాడిన బట్టలు ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయి. అవి చిన్న సైజ్ కావడం వల్ల వేసుకోలేకపోతున్నా కానీ ప్రతిరోజూ వాటిని చూసుకుంటూ, తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా గుండె ముక్కలవుతుంది” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

అలాగే షెఫాలీ చివరి రోజు గురించి చెబుతూ .. “ఆరోజు షెఫాలీ, మా పెట్ డాగ్ సింబాను వాకింగ్‌కి తీసుకెళ్లమని చెప్పింది. నేను బయటకి వెళ్లి వచ్చేసరికి, ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే సీపీఆర్ చేశాను. రెండు సార్లు శ్వాస తీసుకుంది. కానీ ఆ వెంటనే కన్నుమూసింది” అని వెల్లడించారు. షెఫాలీ హార్ట్‌అటాక్‌కు కారణం యాంటీ ఏజింగ్ డ్రగ్స్ అన్న పుకార్లపై కూడా పరాగ్ స్పందించారు.. “షెఫాలీ ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు. కేవలం మల్టీవిటమిన్ మాత్రమే తీసుకుంది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి” అని క్లారిటీ ఇచ్చారు. ఆమె ఇక లేరు అనే నిజం అంగీకరించలేక పోతున్నా అని బాధతో చెబుతున్నారు.

Exit mobile version