Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షెఫాలీ జరివాలా, అప్పటి నుంచి “కాంటా లగా గర్ల్”గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్‌గా, పలు రియాలిటీ షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ముఝ్సే షాదీ కరోగి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టకరంగా తాజాగా 2025 జూన్ 27న కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో షెఫాలీ మరణించారు. ఈ విషయం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
Also Read : Peddi : రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల!
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఇటీవల ఆమె భర్త పరాగ్ త్యాగి, “షెఫాలీ పరాగ్ త్యాగి” పేరుతో ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్‌లోనే తన భార్య గురించి మాట్లాడి, ఆమె లేకుండా జీవితం తనకు ఎంత కష్టమైందో పంచుకున్నారు. పరాగ్ మాట్లాడుతూ – “షెఫాలీ లేకుండా బతకడం కష్టం గా ఉంది. ఆమె వాడిన బ్రష్‌తోనే పళ్లు తోముకుంటున్నాను. ఆమె వాడిన బట్టలు ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయి. అవి చిన్న సైజ్ కావడం వల్ల వేసుకోలేకపోతున్నా కానీ ప్రతిరోజూ వాటిని చూసుకుంటూ, తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా గుండె ముక్కలవుతుంది” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
అలాగే షెఫాలీ చివరి రోజు గురించి చెబుతూ .. “ఆరోజు షెఫాలీ, మా పెట్ డాగ్ సింబాను వాకింగ్‌కి తీసుకెళ్లమని చెప్పింది. నేను బయటకి వెళ్లి వచ్చేసరికి, ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే సీపీఆర్ చేశాను. రెండు సార్లు శ్వాస తీసుకుంది. కానీ ఆ వెంటనే కన్నుమూసింది” అని వెల్లడించారు. షెఫాలీ హార్ట్‌అటాక్‌కు కారణం యాంటీ ఏజింగ్ డ్రగ్స్ అన్న పుకార్లపై కూడా పరాగ్ స్పందించారు.. “షెఫాలీ ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు. కేవలం మల్టీవిటమిన్ మాత్రమే తీసుకుంది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి” అని క్లారిటీ ఇచ్చారు. ఆమె ఇక లేరు అనే నిజం అంగీకరించలేక పోతున్నా అని బాధతో చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!