Site icon NTV Telugu

Babloo Prithiveeraj: అవును.. మేము పెళ్లి చేసుకోలేదు.. అది చేశామంతే

Babloo

Babloo

Babloo Prithiveeraj: బబ్లూ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పెళ్లి అనే సినిమాలో విలన్ గా నటించి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సినిమా తరువాత విలన్ గా, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అనిమల్ సినిమాలో విలన్ గా కనిపించి పాన్ ఇండియా లెవెల్ గుర్తింపును అందుకున్నాడు. ఇక బబ్లూ పృథ్వీరాజ్ సినిమాల కంటే ఎక్కువ ప్రేమలు, పెళ్లిళ్ల దావారనే బాగా ఫేమస్ అయ్యాడు. గతేడాది తెలుగమ్మాయి శీతల్ తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. తనకంటే వయస్సులో సగం ఉన్న అమ్మాయిని పెళ్ళాడి షాక్ ఇచ్చాడు. ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి.. ? అన్నట్లు మాట్లాడిన బబ్లూ పృథ్వీరాజ్ .. తాజాగా శీతల్ తో కూడా బ్రేకప్ చేసుకున్నాడు. ఈ విషయాన్నీ శీతల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

“చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే.. మేము ఊహించినట్లుగా మా రిలేషన్‌షిప్‌ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక బబ్లూ పృథ్వీరాజ్ కు శీతల్ కన్నా ముందే బీనా అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version