Site icon NTV Telugu

NTR Fan Shyam Death: మా అన్న చనిపోయేంత పిరికివాడు కాదు.. కంటతడి పెట్టిస్తున్న శ్యామ్ చెల్లి మాటలు

Shayam

Shayam

NTR Fan Shyam Death: ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మృతి రాజకీయ రంగును పులుముకుంటున్న విషయం కూడా తెల్సిందే. శ్యామ్ మృతిపట్ల చాలా అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణను వేగవంతం చేయాలనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జీవితం మీద విరక్తితో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. అయితే అందులో నిజం లేదని, అతని డెడ్ బాడీ ని చూస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక సహాయం మృతిపై ఎన్టీఆర్ సైతం స్పందించాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. శ్యామ్ చెల్లెలి బాధ్యత తీసుకున్న విషయం కూడా తెల్సిందే. ఇక తాజాగా తన అన్న మృతిపై శ్యామ్ చెల్లెలు ఎమోషనల్ అయ్యింది. తన అన్న చనిపోయేంత పిరికివాడు కాదని చెప్పుకొచ్చింది.

Bro Teaser: ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. ‘బ్రో’ రేపు వస్తున్నాడట

మీడియా ముందు ఆమె మాట్లాడుతూ.. ” మా అన్న ఆత్మహత్య చేసుకోనేంత పిరికివాడు కాదు. మా అన్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. ఏ ఒక్కరోజు ఇంట్లో తనకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ లేదని, తనకు ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపించినట్లు కానీ చెప్పింది లేదు. మా అన్నయ్య గురించి అందరికి తెలుసు.. తెలుసు కాబట్టే తిరుపతి నుంచి అంతమంది వచ్చి అండగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు చేసి.. మీకు మేము ఉన్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పారు. మా అన్నయ్యకు న్యాయం కావాలి.. న్యాయం జరగాలి.. దానివెనుక ఉన్న నిజాలు బయటికి రావాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version