NTV Telugu Site icon

Sharwanand: టీడీపీ నేత మనవరాలితో శర్వా పెళ్లి.. ఎప్పుడంటే..?

Shrwa

Shrwa

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా వివాహం జరగనుంది. గత మూడు రోజుల నుంచి శర్వా వివాహం గురించి వార్తలు గుప్పుమంటున్నా వధువు తాలూకు వివరాలు తెలియలేదు. అయితే ఇప్పుడు వధువు వివరాలతో పాటు ఎంగేజ్మెంట్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మాయి పేరు బొజ్జల పద్మ. దివంగత టీడీపీ నేత గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. కాళహస్తికి చెందిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మేనకోడలు. పద్మ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తోంది.

Read Also: Naresh-pavitra: నరేష్- పవిత్ర ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తా- రమ్య రఘుపతి

కరోనా కారణంగా ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుందని తెలిసింది. ఇక శర్వా- పద్మల వివాహము పెద్దలు కుదిర్చినదే అని తెలుస్తోంది. పెళ్లి కుమార్తె లేదా వారి తరపు బంధువులతో శర్వాకు ఎలాంటి పరిచయాలు లేవని సమాచారం. ఇక ఈ జంట ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబ వర్గాలు వీరి ఎంగేజ్మెంట్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. జనవరి 26 న వీరి ఎంగేజ్మెంట్ అతి తక్కువమంది కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఇక పెళ్లిని వేసవిలో జరగనుందని.. ఇరు కుటుంబ వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట ఫోటోలు బయటికి రానున్నాయి.