Sharwanand: ప్రమోషన్స్ కు రమ్మంటే వాడు రాలేదు.. వాడికి సినిమా ఇప్పించింది నేనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharwanand: శర్వానంద్, రీతూ వర్మ, జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. అమల అక్కినేని ఈ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇస్తోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ నిర్వహించారు. ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తామే హీరో అనుకోని పనిచేశారని చెప్పుకొచ్చాడు. ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ప్రేక్షకుడును తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డామని తెలిపాడు. అమల గారితో వర్క్ చేయడం తనకు కష్టంగా అనిపించలేదని, తన అమ్మతో పనిచేసినట్లే అనిపించిందని అన్నాడు.
ఇక ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారని తెలిపిన శర్వా ప్రియదర్శి కి థాంక్స్ చెప్తూ ప్రమోషన్స్ కు రాలేదని కిషోర్ పై ఫన్నీగా కోపం చూపించాడు. వాడు ప్రమోషన్స్ కు రమ్మంటే రాలేదు. వాడికి సినిమా ఇప్పించింది నేనే.. వాడి సంగతి వచ్చాకా చెప్తా అంటూ నవ్వులు పూయించాడు. ఇక ఈ సినిమాను రీతూ ఒప్పుకున్నందుకు థాంక్స్. పాత్ర ఏంటి..? సీన్స్ ఉన్నాయా..? సాంగ్స్ ఉన్నాయా..? లాంటివి ఏమి అడగకుండా ఇలాంటి కథలో చిన్న భాగమైతే చాలు అనుకోని చేసిందని తెలిపాడు. సినిమాను తామందరం కథను నమ్మి చేశామని, దర్శకుడు శ్రీ కార్తీక్ చెప్పిన విధానం తనకు నచ్చిందని తెలిపాడు. మీ అందరికి ప్రామిస్ చేసి చెప్తున్నా.. గర్వంగా చెప్తున్నా.. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు ఇస్తున్నాం అని చెప్పిన శర్వా కరోనా పాండమిక్, తనకు యాక్సిడెంట్ అయినా నిర్మాతలు పర్వాలేదని, మంచిగా సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం అంటూ ముగించాడు.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!