పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఈ నెల 25న జనం ముందుకు వస్తుండటంతో ఆ రోజున విడుదల కావాల్సిన మరో మూడు సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వాన్ని పీక్స్ కు తీసుకెళ్ళిన శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అలానే వరుణ్ తేజ్ ‘గని’ మూవీని అదే తేదీకి పంపే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
అటు కిరణ్ అబ్బవరం నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ మూవీ సైతం ఈ నెల 25న రాబోతోందని తొలుత చెప్పారు. ఆ సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లేనని తెలుస్తోంది. సో…. వచ్చే వీకెండ్ లో 24న తమిళ అనువాద చిత్రం ‘వలిమై’, 25న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నాయి.
