Site icon NTV Telugu

Oke Oka Jeevitham: శర్వానంద్ పరిపూర్ణ నటుడు: అమల కితాబు!

Oka Oak Jeevitha

Oka Oak Jeevitha

 

శర్వానంద్ నటించిన 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శుక్రవారం జనం ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాదు… ఫీల్ గుడ్ మూవీగా సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అమల అక్కినేని మాట్లాడుతూ, ”ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. అందరూ సినిమాని ప్రశంసిస్తున్నారు. శర్వానంద్ పరిపూర్ణ నటుడు. అతనితో వర్క్ చేయడం ఆనందంగా వుంది. రీతూవర్మ, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి అందరూ చక్కగా చేశారు. శ్రీకార్తీక్ సినిమాకి అద్భుతంగా దర్శకత్వం వహించారు. ప్రభు చాలా ధైర్యమున్న నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. యువత ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటే విజయం ఖాయమని చెప్పే సినిమా ఇది” అని అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ, ”ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది!? దీని కోసమే కదా సినిమాల్లోకి వచ్చామనిపించింది. ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనే దాన్ని అటుంచితే థియేటర్ లో చప్పట్లు వినాలనిపించింది. ప్రేక్షకులు నేను కోరుకున్న ప్రేమని ఇచ్చారు. సినిమా చూసిన అందరూ హత్తుకుంటున్నారు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి!? నా చుట్టుపక్కల వున్న వాళ్ళంతా నేను సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. ఇదే నా మొదటి సక్సెస్. ఇంత గొప్ప కథని రాసిన దర్శకుడు శ్రీకార్తీక్ కు కృతజ్ఞతలు. అతని మొదటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. అమల గారితో పని చేయడం గౌరవంగా వుంది. అమల గారు కనిపించగానే థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమల గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

‘వెన్నెల’ కిషోర్ మాట్లాడుతూ, ”నేను చాలా స్ట్రాంగ్ అని ఫీలౌతాను. కానీ ఇందులో అమల గారి ఎంట్రీ తర్వాత కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాలో మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు శ్రీకార్తీక్ కు కృతజ్ఞతలు. అలాగే ఇందులో నటించే ఛాన్స్ ఇప్పించిన శర్వానంద్ కి థాంక్స్. ప్రియదర్శి కూడా చాలా సపోర్ట్ చేశారు. అమల గారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని అన్నారు. శ్రీకార్తీక్ మాట్లాడుతూ, ” ఈ సినిమా అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం గొప్ప విజయంగా భావిస్తున్నాను. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ గారి నటనని ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శర్వానంద్- అమల గారు తల్లీ కొడుకులు గా ప్రేక్షకుల మనసుని హత్తుకున్నారు. ‘వెన్నెల’ కిషోర్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు” అని చెప్పారు. ‘సినిమాకి అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని, మంచి కలెక్షన్స్ రాబడుతోందని నిర్మాత ప్రభు తెలిపారు. ‘నిజాయితీగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరించడం ఆనందాన్ని కలిగిస్తోంద’ని సుజిత్ అన్నారు.

Exit mobile version