శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కన్పించి మెప్పించారు. సినిమా స్కోర్, సౌండ్‌ట్రాక్‌ను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా… తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు.
Read Also : Pawan Kalyan : ఖరీదైన ప్లాట్ కొన్న పవర్ స్టార్ ?
ఆ టీజర్ విషయానికొస్తే… నేడు శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఆడవాళ్లు మీకు జోహార్లు” టీం శర్వాకు బర్త్ డే విషెస్ అందిస్తూ ఈ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇక శర్వాకు అభిమానులతో పాటు తోటి స్టార్స్ నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
