Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా బాగుంటే జనం వస్తారు. వాళ్లే ఆదరిస్తారు అనేది పాత మాట. సినిమా బాగుందని జనానికి తెలిసేలా ప్రమోషన్లు చేయాలి.. అనేదే ఇప్పటి ట్రెండ్. తాజాగా విడుదలైన ‘బైకర్’ సినిమా విషయంలో యూనిట్ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకు కావాల్సిన కనీస స్థాయి ప్రమోషన్లను కూడా ఈ టీమ్ నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ గత చిత్రం నారీ నారీ నడుమ మురారి భారీ హిట్ అయింది ఆ సినిమాకి శర్వ ముందు నుంచి మంచి ప్రమోషన్స్ చేశాడు. కానీ ఈ సినిమా విషయంలో ఎందుకో దాన్ని ప్రమోట్ చేసినంత చేయలేక పోయాడు. ఏ పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా విడుదలకు ముందు వచ్చే ‘హైప్’ అనేది చాలా ముఖ్యం. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్‌లో ఉండాలంటే టీజర్, ట్రైలర్‌తో పాటు ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేలా ఈవెంట్స్ చేయాలి. కానీ ‘బైకర్’ టీమ్ మాత్రం కనీసం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి హైప్ పెంచే ప్రయత్నం చేయలేదు.
Also Read:Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?
Also Read
విడుదల వారంలో హీరో మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి ముచ్చటించిన దాఖలాలు లేవు. ప్రమోషన్లు లేకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయమే సరిగ్గా తెలియలేదు, దీనివల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బైకర్’ కంటెంట్ పరంగా చాలా బాగుంది, షో షోకి మౌత్ టాక్ పెరుగుతోంది. అయితే, ముందే సరైన పబ్లిసిటీ ఉండి ఉంటే.. ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉండేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, మంచి కలెక్షన్లతో మొదలవ్వాల్సిన సినిమా, ఇప్పుడు కేవలం ‘మౌత్ టాక్’ మీద ఆధారపడి నెమ్మదిగా పుంజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, ఇకనైనా యూనిట్ దూకుడు పెంచి సోషల్ మీడియాలో వస్తున్న మంచి రివ్యూలను, ప్రేక్షకుల రెస్పాన్స్‌ను భారీగా ప్రమోట్ చేయాలి.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!