Site icon NTV Telugu

Sharukh Khan: షారుఖ్ కు కరోనా.. ‘జవాన్’ కి బ్రేక్

Jawan

Jawan

ప్రస్తుతం బాలీవుడ్ ను కరోనా పట్టి పీడిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా బారిన పడిన విషయం విదితమే.. ఇక తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మే 25 న షారుఖ్, అతని భార్య గౌరీ ఖాన్ సైతం కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి రావడంతోనే ప్రతి ఒక్కరు జలుబు, తలనొప్పి లాంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారట. వెంటనే టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక షారుఖ్ ఒక్కడికేనా.. అతని భార్య గౌరీ కి కూడా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ కరోనా కారణంగా షారుఖ్ మరో 20 రోజుల వరకు ఎక్కడికి కదిలే పని లేదు. దీంతో షారుఖ్ సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యినట్లే. ముఖ్యంగా తమిళ్ డైరెక్టర్ అట్లీ తో షారుఖ్ తీస్తున్న జవాన్ కు బ్రేకులు పడ్డట్లే.. ఇటీవలే జవాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టాలనుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా వున్నాయి వరకు కరోనా లాక్ డౌన్, ఆ తరువాత షారుఖ్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసు.. ఇక అవన్నీ క్లియర్ అయ్యి ఈసారైనా పట్టాలెక్కుతోంది అనుకునేలోపు ఇది ఒకటి.. ఇంకా ఎన్నిరోజులకు ఈ సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.

Exit mobile version