Jawan: టామ్ క్రూజ్ తో కలిసి వస్తున్న కింగ్ ఖాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే కారణంగా జవాన్ సినిమా సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. అది కూడా రీసెంట్ గానే 18 సెకన్ల పాటు ఒక చిన్న గ్లిమ్ప్స్ ని విడుదల చేసి సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు. ఈ మూవీ నుంచి టీజర్ ఎప్పుడు బయటకి వస్తుందా అని షారుఖ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టీజర్ అప్డేట్ కోసం రచ్చ రచ్చ చేసారు. ఇలాంటి సమయంలో ఒక అదిరిపోయే న్యూస్ షారుఖ్ ఫాన్స్ కోసం వచ్చేసింది. కింగ్ ఖాన్ గా, బాలీవుడ్ బాద్షాగా ఉన్న షారుఖ్ ‘జవాన్’ టీజర్ కోసం మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఉన్నాడు.
మాములుగా షారుఖ్ సినిమా అంటే ఓవర్సీస్ లో సాలిడ్ బిజినెస్ ఉంటుంది. అలాంటిది ఆ బిజినెస్ ని మరింత పెంచడానికి జవాన్ టీజర్ ని ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్’ సినిమాతో పాటు రిలీజ్ చేయనున్నాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా జులై 12న ప్రపంచవ్యాప్త ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ లో జవాన్ టీజర్ ని అటాచ్ చెయ్యనున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలో బయటకి వచ్చే అవకాశం ఉంది. మిషన్ ఇంపాజిబుల్ సినిమాకి ఈస్ట్ మార్కెట్ ని షేక్ చేసే సత్తా ఉంది, బిగ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ని ఈ యాక్షన్ మూవీ కోసం బ్లాక్ చేస్తారు. ఇలాంటి సమయంలో జవాన్ టీజర్ ని అటాచ్ చేయడం, షారుఖ్ ఓవర్సీస్ మార్కెట్ ని మరింత పెంచే విషయమే. మరి జవాన్ టీజర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.
Also Read
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!