Site icon NTV Telugu

Jawan Japan Release: జపాన్‌లో రిలీజ్‌ కాబోతున్న షారుఖ్ ఖాన్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jawan

Jawan

Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్‌ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ “జవాన్‌” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్‌ ద్విపాత్రాభినయం, యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఏడాది రెండు సార్లు ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన నటుడిగా షారుక్‌ రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు జపాన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడానికి రెడీ అయ్యాడు.

Also Read: 35 Chinna Katha Kadhu: ఇదో మా సిన్న కుటుంబం తొలి సూపు అంటూన్న నివేదా థామ‌స్..

జవాన్ మూవీ ని జపాన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇండియన్‌ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ లభించడమే కాకుండా అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. గతంలో ఎస్ ఎస్ రాజామౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు కేజీయఫ్‌ పార్ట్ 1, పార్ట్‌ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి జవాన్ సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. జాపనీస్ లాంగ్వాజ్ లో జవాన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్‌. మరి అక్కడ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి.

Exit mobile version