బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ట్రైలర్ ని దించాడు. సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. జవాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచుతూ జైలర్ ట్రైలర్ బయటకి వచ్చేసింది. చాలా రోజులుగా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ ట్రైలర్ దాదాపు 2:45 నిమిషాల డ్యూరేషన్ తో కట్ చేసారు. షారుఖ్ ఖాన్ ని నాలుగు గెటప్స్ లో చూపిస్తూ డిజైన్ చేసిన ట్రైలర్ పక్కా సీట్ మార్ సినిమాని చూడబోతున్నాం అనే ఫీలింగ్ ని తెచ్చింది. షారుఖ్ ఆర్మీ సోల్జర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, గుండులో విలన్ గా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ని పోట్రే చేసాడు.
ఒక కమర్షియల్ సినిమాలో హీరోకి మాములుగా ఇన్ని వేరియేషన్స్ చూపించే అవకాశం రాదు, అలాంటిది అట్లీ షారుఖ్ ని పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు ఉన్నాడు. అందుకే ట్రైలర్ లో బాలీవుడ్ టింట్ కన్నా సౌత్ నేటివిటీ ఎక్కువగా ఉంది. నయనతార షారుఖ్ ని పట్టుకునే స్పెషల్ టీమ్ హెడ్ గా కనిపించింది. హిందీలో జవాన్ నయన్ కి డెబ్యూ అయినా, తను చాలా కాన్ఫిడెంట్ గా స్క్రీన్ ని ఓన్ చేసుకుంది. దీపికా-షారుఖ్ ల మ్యాజిక్ ట్రైలర్ లో స్పెషల్ గా నిలిచింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ వెపన్ డీలర్ కాళీగా సేతుపతి ట్రైలర్ లో కనిపించాడు. షారుఖ్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్, విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో కూడా ఉన్నాయి. ఒక లుక్ లో యంగ్ గా, ఇంకో లుక్ లో కాస్త వయసు వచ్చినట్లు, మూడో లుక్ లో పూర్తిగా వయసు మీద పడిన ఒక బిజినెస్ మెన్ గా సేతుపతి కనిపించాడు.
షారుఖ్ ప్లే చేసిన ఫాదర్ క్యారెక్టర్ కి… విజయ్ సేతుపతి యంగ్ లుక్ కి మధ్య ఉన్న కథనే అసలు సినిమాకి పునాది అనినట్లు ఉంది. ఇక ట్రైలర్ లో తప్పకుండా చెప్పాల్సింది అనిరుధ్ గురించి… కెరీర్ గోల్డెన్ ఫేజ్ లో ఉన్న అనిరుధ్, జవాన్ ట్రైలర్ కి సూపర్బ్ స్కోర్ ఇచ్చాడు. నార్మల్ సీన్స్ ని కూడా మ్యూజిక్ ఎలివేట్ చేస్తున్న అనిరుధ్ జవాన్ సినిమా సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం అవనున్నాడు. మొత్తానికి ట్రైలర్ తోనే బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన జవాన్ టీమ్… సెప్టెంబర్ 7న ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.
ఒక జవాన్ మరియు జస్టిస్.
మహిళలు మరియు వాళ్ళ ప్రతీకారం.
ఒక తల్లి మరియు కొడుకు.
ఖచ్చితంగా, చాలా సరదాగా !!!
రెడీ ఆఁ …!!!#JawanTrailer ఇప్పుడు విడుదల అయ్యింది!Oka Jawan mariyu Justice
Mahilalu mariyu vaalla pratheekaaram
Oka thalli mariyu koduku.
Khacchithamgaa, chaalaa… pic.twitter.com/mgYN5cIFio— Shah Rukh Khan (@iamsrk) August 31, 2023