పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే కారణంగా జవాన్ సినిమా సెప్టెంబర్ 7కి వాయిదా పడింది. అది కూడా రీసెంట్ గానే 18 సెకన్ల పాటు ఒక చిన్న గ్లిమ్ప్స్ ని విడుదల చేసి సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు. ఈ మూవీ నుంచి టీజర్ ఎప్పుడు బయటకి వస్తుందా అని షారుఖ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టీజర్ అప్డేట్ కోసం రచ్చ రచ్చ చేసారు. ఇలాంటి సమయంలో అసలు టీజర్ కాదు ట్రైలర్ తో బయటకి వస్తాం కాస్కోండి అంటూ షాక్ ఇచ్చారు జవాన్ మేకర్స్.
జవాన్ టీజర్ కోసం షారుఖ్ ఫాన్స్ అంతా వెయిట్ చేస్తుంటే… ట్రైలర్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతుంది వెయిట్ చేయండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #JawanTrailer టాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ ఏ రోజు రిలీజ్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి ఏ క్షణంలో అయినా బయటకి రావచ్చు. అయితే ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం జవాన్ ట్రైలర్ ని ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్’ సినిమాతో పాటు రిలీజ్ చేయనున్నారని సమాచారం. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమా జులై 12న ప్రపంచవ్యాప్త ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ లో జవాన్ ట్రైలర్ ని అటాచ్ చెయ్యనున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంటే మేకర్స్ నుంచి బయటకి రానుంది. ఇదిలా ఉంటే జవాన్ vs సలార్ బిజినెస్ అనే టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. థియేటర్ బిజినెస్ నుంచి ఆడియో రైట్స్ వరకు ప్రతి విషయంలో షారుఖ్ అండ్ ప్రభాస్ సినిమాల మధ్య పోటీ ఉంది. మరి ఈ జవాన్, సలార్ వార్ ట్రైలర్ రికార్డ్స్ నుంచే మొదలవుతుందేమో చూడాలి.
Stay Tuned…#JawanTrailer pic.twitter.com/BqM0kmxHLQ
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 8, 2023