NTV Telugu Site icon

Sharukh Khan: నెలలో రిలీజ్ ఉంది, అప్డేట్ ఇవ్వండ్రా బాబు…

Jawan

Jawan

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి, వెయ్యి కోట్ల హీరోగా మారాడు. దాదాపు పదేళ్ల తర్వాత షారుఖ్ కొట్టిన హిట్, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని బ్రేక్ చేసింది. పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది, షారుఖ్ ఖాన్ ఫాన్స్ ని కూడా లైం లైట్ లోకి తీసుకోని వచ్చింది. ఈ హిట్ తో షారుఖ్ ఫాన్స్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు. సరిగ్గా అయిదు నెలల క్రితం వరకూ షారుఖ్ ఖాన్ అన్నా, షారుఖ్ ఫాన్స్ అన్నా బాలీవుడ్ లో పెద్దగా సౌండ్ ఉండేది కాదు. పదేళ్లుగా హిట్ లేకపోవడం, అయిదేళ్లుగా సినిమానే లేకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, కింగ్ అఫ్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న షారుఖ్ ఖాన్ సడన్ గా ఫ్లాప్స్ స్ట్రీక్ లోకి వెళ్లిపోవడంతో ఫాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఆ సైలెన్స్ ని వయోలెంట్ గా బ్రేక్ చేసి, ఫాన్స్ అందరినీ యాక్టివ్ మోడ్ లోకి తెచ్చింది పఠాన్ సినిమా.

కింగ్ ఖాన్ కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా దాన్ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. పఠాన్ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ కావాలి అంటూ షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. “WAITING FOR JAWAN UPDATES” “Jawan Trailer Update” అనే ట్యాగ్స్ ని క్రియేట్ చేసి దర్శకుడిని, షారుఖ్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. జూన్ నెలలో జవాన్ సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయ్యి ఉంది. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఒక్క పోస్టర్ కూడా బయటకి రాలేదు. దీంతో కేవలం నెల రోజుల్లో రిలీజ్ పెట్టుకోని షారుఖ్ సినిమాకి అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు ఏంటని ఫాన్స్ ఆవేశంతో ఊగిపోయి, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అట్లీ జవాన్ నుంచి ఎలాంటి అప్డేట్ ని దించుతాడో చూడాలి.

Show comments