Site icon NTV Telugu

Sharathulu Varthisthai Trailer: మధ్య తరగతి వాడు తిరగబడితే.. ఎట్లుంటుందో చూపిస్తా

Bhoomi

Bhoomi

Sharathulu Varthisthayi Trailer: చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న షరతులు వర్తిస్తాయి సినిమా మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో చైతన్య పేరు చిరంజీవి, భూమి పేరు విజయశాంతి. వీరిద్దరూ చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు. ఊర్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుంటారు. మధ్యతరగతి ఆప్యాయతలు, అనురాగాల మధ్య సాగుతున్న వీరి జీవితంలోకి బోగస్ కంపెనీ చిచ్చు పెడుతుంది. కష్టపడకుండా డబ్బు సంపాదించొచ్చు అని ఆశపడి.. తాము దాచుకున్న డబ్బును ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటారు. అయితే.. ఆ కంపెనీ ఆ డబ్బును తీసుకొని ఉడాయిస్తుంది. దీంతో అందరి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇక ఈ సమస్యను చిరంజీవి ఎలా పరిష్కరించాడు. మధ్య తరగతి వాడు తిరగబడితే.. ఎట్లుంటుంది.. ఇలాంటి కంపెనీలను ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు.. ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా మొత్తం ఒక రోలర్ కాస్ట్ లా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. అరుణ్ చిలువేరు మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ తోనే సినిమాకు ఒక హైప్ తీసుకొచ్చారు. మరి ఈ సినిమాతో చైతన్య రావు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version