Site icon NTV Telugu

Sharath Kumar: సెట్ లో అందరి ముందు విజయశాంతి నన్ను తిట్టింది..

Sharath Kumar

Sharath Kumar

Sharath Kumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ప్రస్తుతం సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ఇటీవలే పరంపర వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన శరత్ కుమార్ ప్రస్తుతం కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముదనకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చిత్ర బృందం సినిమా కబుర్లతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో శరత్ కుమార్.. సెట్ లో విజయశాంతి తనను విసుక్కున్న విషయాన్నీ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చారు.

“విజయశాంతి హీరోయిన్ గా నటించిన సమాజంలో స్త్రీ అనే సినిమా నా మొదటి తెలుగు సినిమా. అందులో ఒక చిన్న పాత్ర. అయితే ఒక రోజు సెట్ లో ఒక ముఖ్య పాత్రధారి రాలేదు. అప్పటికప్పుడు కొత్తవారి కోసం వెతుకుతున్నారు. నేను, అప్పటికే నిర్మాతకు తెలిసి ఉండడంతో నన్ను ఆ పాత్రను చేయమన్నారు. కానీ, నాకు అప్పటికి నటన రాదు. టేకుల మీద టేకులు తీసుకున్నాను. దీంతో విసిగిపోయిన విజయశాంతి అందరిముందు నన్ను తిట్టింది. నటన రానివాళ్లను తీసుకొచ్చి ఎందుకు నా టైమ్ వేస్ట్ చేస్తున్నారు. నటించడం రాకపోతే ఎందుకు వచ్చారు. మంచి ఆర్టిస్టులను పెట్టొచ్చుగా అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత నేను హీరోగా మారాకా ఒక సెట్ లో మళ్లీ ఆమెను కలిసి .. నన్ను మీరు ఆరోజు సెట్ లో తిట్టారు అని సరదాగా అంటే.. అయ్యో క్షమించండి. ఆరోజు సీన్స్ అవ్వడంలేదని కోపం చూపించాను” అని చెప్పిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version