Site icon NTV Telugu

Shanti Priya: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్.. సెట్స్‌లో అందరి ముందే ఆ పాడుపని

Shanti Priya Body Shaming

Shanti Priya Body Shaming

Shanti Priya: నలుగురిలో ఉన్నప్పుడు నటీనటులు గౌరవంగా పలకరించుకుంటారు. కుళ్లు జోకులు వేసుకోవడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా కామెంట్లు చేయడం వంటివి అస్సలు చేయరు. తమ ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే.. మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. కానీ.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం తనని నలుగురిలో అవమానించాడని నటి శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. తన మనసు నొచ్చుకునేలా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశాడని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ తనని బాడీ షేమింగ్ చేశాడని చెప్పిన శాంతిప్రియ.. ఇప్పుడు మరిన్ని విషయాలు బయటపెట్టింది.

India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు

ఓ ఇంటర్వ్యూలో శాంతిప్రియ మాట్లాడుతూ.. ‘‘ఇక్కె పె ఇక్కా సినిమా కోసం మేమంతా ఒక మిల్లులో షూటింగ్ చేస్తున్నాం. నాది గ్లామర్ రోల్ కావడం వల్ల పొట్టిదుస్తులు ధరించాను. పాత్ర డిమాండ్ మేరకు మోకాలి పైన ఉండే దుస్తుల్ని వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అక్షయ్ చూసి.. ‘ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలిందా? అంత నల్లగా ఉందేంటి?’ అని కామెంట్ చేశాడు. దాంతో సెట్‌లోని ఉన్నవాళ్లందరూ నన్ను చూసి నవ్వారు. నాకప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన ఆ బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఆ సమయంలో అమ్మ మాత్రమే నాకు అండగా నిలబడింది’’ అని చెప్పుకొచ్చింది. తనతో పాటు తన సోదరి భానుప్రియ సైతం ఇలాంటివి ఎన్నో ఎదుర్కుందని తెలిపింది.

Game Changer : మళ్ళీ మొదలైన రాంచరణ్ గేమ్ చేంజర్ షూటింగ్..

తన స్కిన్ కలర్‌పై అప్పట్లో కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పటికీ తనకు క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఒకసారి దీనిపై మాట్లాడినప్పుడు.. జోక్ చేశానంటూ అక్షయ్ చెప్పాడే తప్ప సారీ మాత్రమే చెప్పలేదని తెలిపింది. అక్షయ్ లాంటి నటుడు తనపై అలాంటి కామెంట్ చేయడం తనని బాగా నొప్పించిందని చెప్పుకొచ్చింది. కాగా.. 1980-90ల్లో శాంతిప్రియ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు. అయితే.. 1994 తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ 2014లో రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.

Exit mobile version