Game Changer : మళ్ళీ మొదలైన రాంచరణ్ గేమ్ చేంజర్ షూటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 15 వ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన మధ్యలో దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది.అలాగే హీరో రాంచరణ్ దాదాపు మూడు నెలలు ఫ్యామిలీ కోసం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. ఈలోపు శంకర్ ఇండియాన్2 మూవీ షూటింగ్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేశాడు. ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ మళ్ళీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బేగంపేటలోని షూటింగ్ స్పాట్‌లో శంకర్ బర్త్ డే ను గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్.దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలో రీసెంట్ గా స్టంట్ మాస్టర్ అన్బరివ్ నేతృత్వంలో మైక్రోబాట్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు.3 రోజుల బ్రేక్ తరువాత.. తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయింది.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే మరో లొకేషన్ కు షిఫ్ట్ అవనున్నట్లు సమాచారం
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?