Site icon NTV Telugu

Shanthi Priya : గుండు గీయించుకున్న స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే..

Shanthi Priya

Shanthi Priya

Shanthi Priya : అమ్మాయిలు అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు తెలిసిందే. అందంగా ఉండాలంటే జుట్టు ఉండాల్సిందే అని అనుకుంటారు. జుట్టు ఒత్తగా, అందంగా ఉండటం కోసం క్రీములు వాడుతుంటారు. ఇక హీరోయిన్లు అందం కోసం ఎంతగా ఖర్చు పెడుతారో చూస్తున్నాం. కానీ తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం గుండు గీయించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శాంతి ప్రియ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసింది. ఆమె ప్రముఖ హీరోయిన్ భానుప్రియ సోదరి. తాజాగా ఆమె గుండు గీయించుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా తెలిపింది. అసలు అందం అంటే ఏంటి.. ఎందుకు గుండు గీయించుకోవాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించింది.

Read Also : BJP New President: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈయనే..

‘రీసెంట్ గానే గుండు గీయించుకున్నాను. ఒక అమ్మాయిగా ఈ సమాజంలో నాకు చాలా కండీషన్లు ఉంటాయి. అయినా సరే నేను వాటికి భయపడను. ఎందుకంటే నా దృష్టిలో అందం అంటే కేవలం పైకి కనిపించే శరీరం కాదు. మంచి ఆత్మవిశ్వాసమే అసలైన అందం. ఇంకెన్నాల్లు ఈ కట్టుబాట్లకు బంధీగా ఉంటాం. నచ్చినట్టు జీవిద్దాం’ అంటూ ఆమె తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version